అక్షరటుడే, బాన్సువాడ: విద్యార్థి తండ్రిపై ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవ్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు విద్యార్థులకు రూ. 1500 చొప్పున తీసుకురావాలని కోరడంతో ఓ విద్యార్థి తండ్రి సుందర్ మద్యం మత్తులో డబ్బులు ఎందుకు ఇవ్వాలని పాఠశాలకు వెళ్లి నిలదీశాడు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఉపాధ్యాయురాలి భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామకృష్ణ ఆవేశంతో సుందర్ పై దాడి చేశాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.