అక్షరటుడే, వెబ్‌డెస్క్: మహిళ కాళ్లపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ఆమె కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటన హనుమకొండ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. శుక్రవారం మహిళ బస్టాండ్‌లో ఉండగా ఆర్టీసీ బస్సు కాళ్లపై నుంచి వెళ్లింది. దీంతో ఆమె బాధతో విలవిల్లాడింది. ప్రమాదంలో ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయి. ప్రమాదానికి గురైన మహిళను హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన రాజక్కగా గుర్తించారు.
Advertisement
Advertisement