అక్షరటుడే, బోధన్‌: బోధన్‌ మండలం శ్రీనివాస క్యాంప్‌లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. నాగంపల్లి శ్రీకాంత్‌ ఇంట్లో బుధవారం అర్ధరాత్రి దొంగలు ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. యజమాని శ్రీకాంత్‌, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బంగ్లాపై నిద్రించారు. అర్ధరాత్రి దొంగలు ఇంటి తాళం, బీరువా పగులగొట్టి రెండు తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.15 వేల నగదును ఎత్తుకెళ్లారు. యజమాని ఉదయం నిద్రలేచి కిందికి వచ్చేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.