అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలో ఈ నెల 23న నిర్వహించనున్న హనుమాన్‌ శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా నిర్వహించే యాత్రలో ఇబ్బందులు కలుగకుండా వాహనదారులు సూచనలు పాటించాలని కోరారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొననున్న నేపథ్యంలో రోడ్లు, దుకాణాల ముందు వాహనాలు నిలపవద్దని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యాత్ర సాగే లలితామహల్‌ రైల్వేగేట్‌, గంజ్‌ గేట్‌ నంబరు-2, గోదాం రోడ్‌, దేవి రోడ్‌, గాంధీ చౌక్‌, నెహ్రూ పార్క్‌, పెద్దబజార్‌, ఆర్‌ఆర్‌ చౌరస్తా వరకు దుకాణాల యజమానులు, ప్రజలు రోడ్ల పక్కన వాహనాలు పార్క్‌ చేయవద్దన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  VHP | సీపీని కలిసిన వీహెచ్​పీ నాయకులు