అక్షరటుడే, కామారెడ్డి: డీసీఎం కిందపడి ఇద్దరు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్‌ మండలం పెద్దమ్మ స్టేజీ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూరు మండలం మల్లుపల్లికి చెందిన షేక్‌ అబ్దుల్లా, సయ్యద్‌ పైరా కలిసి బుధవారం ఉదయం బైకుపై వెళ్తుండగా డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వారిద్దరు డీసీఎం కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
Advertisement