అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా ఉర్దొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెల 15న వైస్ చైర్‌పర్సన్ ఇందుప్రియ చైర్ పర్సన్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా.. ఖాళీ అయిన వైస్ చైర్‌పర్సన్ పోస్టుకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారు. ఆర్డీవో రంగనాథ్‌రావు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలో 49 మంది కౌన్సిలర్లు, ఒక ఎక్స్‌అఫీషియో సభ్యుడు(ఎమ్మెల్యే)తో కలిపి మొత్తం 50 మంది సభ్యులున్నారు. కోరంకు 26 మంది సభ్యులు హాజరుకావాల్సి ఉండగా.. 30 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి ఉర్దొండ వనిత పేరును ప్రకటించగా సభ్యులు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం అధికారులు వనితతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ ఇందు ప్రియ, కమిషనర్ సుజాత, వివిధ వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా వనిత
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement