కాంగ్రెస్‌ పాలనకు ప్రజల్లో ఆదరణ

0

అక్షరటుడే, నిజామాబాద్‌రూరల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. బుధవారం ఇందల్వాయి, మోపాల్‌, నిజామాబాద్‌ రూరల్‌, జక్రాన్‌పల్లి మండలాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి, అణిచివేతలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ.. ప్రజాపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.