అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామంలోని ఇందూరు తిరుమల ఆలయంలో శ్రీనివాసుని కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం దేవదేవుల ఉత్సవమూర్తులను మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపు నిర్వహించి ఆలయ ఆవరణలో అందంగా ముస్తాబు చేసిన మండపంలో కొలువు తీర్చారు. అనంతరం వేద పండితులు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు చేశారు.