ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకున్న గ్రామస్థులు

0

అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూరు మండలం కిష్టాపూర్‌లో ఓ కుల సంఘ భవనం ప్రహరీ నిర్మాణాన్ని గ్రామస్థులు శుక్రవారం అడ్డుకున్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కాకుండా రోడ్డుపైకి వచ్చి నిర్మాణం చేపడుతున్నారని వారు ఆరోపించారు. అధికారులు వచ్చి నిర్మాణాన్ని ఆపివేయాలని కోరారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. గ్రామస్థులు ప్రహరీ పిల్లర్లను తొలగించే ప్రయత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పంచాయతీ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాల వారిని సముదాయించారు.