అక్షరటుడే, బోధన్: ఎడపల్లి మండలం దుబ్బతండాలో పంచాయతీ సెక్రెటరీపై దంపతులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నేనావత్ దేవిసింగ్, నేనావత్ నీల తమ ఇంటి వద్ద కుళాయి ద్వారా నీళ్లు రావడంలేదని నీటి పైప్‌లైన్ ధ్వంసం చేశారు. ఈ విషయమై శుక్రవారం కార్యదర్శి వారిని ప్రశ్నించగా దుర్భాషలాడుతూ అతనిపై దాడి చేశారు. దీంతో సెక్రెటరీ ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.