అక్షరటుడే, వెబ్ డెస్క్: మోపాల్ మండలం న్యాల్ కల్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ భార్య కట్టుకున్న భర్తను హత్య చేసింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. న్యాల్ కల్ కట్ట సమీపంలో నివాసం ఉండే.. భార్యాభర్తలు లక్ష్మి, లక్ష్మణ్(35) మధ్య తరుచూ గొడవలు జరిగేవి. శుక్రవారం రాత్రి కూడా గొడవ జరగడంతో భార్య ఆగ్రహంతో భర్త తలపై బండరాయితో మోది హతమార్చింది. మోపాల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి ఓ భార్య తన భర్తను హతమార్చింది. 24 గంటల వ్యవధిలోనే రెండు హత్యలు చోటు చేసుకోవడం చర్చకు దారితీసింది.