హోలీ వేళ మద్యం షాపులు బంద్‌

0

అక్షరటుడే, ఇందూరు: హోలీ పండుగ సందర్భంగా మద్యం షాపులు ముసివేయనున్నారు. మార్చి 24న(ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి 26వ తేదీ(మంగళవారం) ఉదయం 6 గంటల వరకు షాపులు మూతబడనున్నాయి. ఈ మేరకు సీపీ కల్మేశ్వర్‌ ఆదేశాలు జారీ చేశారు. షాపులు మూసివేయనుండడంతో మద్యం ప్రియులు వైన్స్‌షాపుల వద్ద బారులు తీరుతున్నారు. ఎలాంటి గొడవలకు తావులేకుండా ముందుజాగ్రత్త చర్యల్లో బాగంగా వైన్స్ షాపులు మూసివేయాలని పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.