ఎల్లారెడ్డి అభివృద్ధికి ఎంపీ బీబీ పాటిల్‌ చేసిందేమీ లేదు

0

అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎంపీ బీబీ పాటిల్‌ పదేళ్లుగా ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావు అన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు ప్రతి కార్యకర్త నుంచి ఉన్నత పదవుల్లో ఉన్న నాయకుల వరకు తమ వంతుగా కృషి చేయాలన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. అలాగే నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు.