అక్షరటుడే, బాన్సువాడ: దేశంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారని జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ అన్నారు. వర్నిలో శుక్రవారం నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు. కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారమని, మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమన్నారు. మహిళల అభ్యున్నతికి బీజేపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. జహీరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్ల కాలంలో జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని, కొన్ని పనులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. బీజేపీకి చెందిన వ్యక్తి ఎంపీగా ఉంటేనే కేంద్రం నుంచి నిధులు సాధించడం తేలికవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి యెండల లక్ష్మీనారాయణ, కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, నేతలు గంగారం, మొక్కన్న, గుడుగుట్ల శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, హన్మాండ్లు యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, దొరబాబు, ఇల్టం శంకర్ తదితరులు పాల్గొన్నారు.