అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: జహీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, సంగారెడ్డి కలెక్టర్‌ క్రాంతి వల్లూరుకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంపగోవర్ధన్‌, జాజాల సురేందర్‌, హన్మంత్ షిండే, సంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ జైపాల్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు పాల్గొన్నారు.