అక్షరటుడే, కామారెడ్డి: జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఎంపీ బీబీపాటిల్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాలను సోమవారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, సంగారెడ్డి కలెక్టర్‌ క్రాంతి వల్లూరుకు అందజేశారు. ఆయన వెంట కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, బీజేపీ నాయకులు ఉన్నారు.