అక్షరటుడే, వెబ్‌డెస్క్: Alcohol ban | ఉజ్జయిని, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మద్యం బ్యాన్ చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మరో 17 పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రాంతాల్లో లిక్కర్‌ను నిషేధించింది. ఈ నిషేధం ఏప్రిల్ 1 నుంచే అమలులోకి వచ్చింది.
Alcohol ban | 19 ప్రాంతాల్లో మద్యం షాపులు మూసివేత
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్, మండలేశ్వర్, మైహార్, ఓర్చా, చిత్రకూట్, పన్నా, ముల్తాయ్, దాటియా, మండలా, మందసౌర్ ప్రాంతాలతో పాటు.. అమర్‌కంటక్, కుండల్‌పూర్, బర్మన్‌కలన్, సల్కన్‌పూర్, బందక్‌పూర్, లింగా, బర్మన్‌ఖుర్డ్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బార్‌లు మూసివేశారు. కాగా.. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.