అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Railway Passengers | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad railway station)లో ఆరు ప్లాట్‌ఫామ్‌లు మూసి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆధునికీకరణ పనుల్లో భాగంగా ఆరు ప్లాట్‌ఫామ్‌లు మంగళవారం నుంచి క్లోజ్(Close) చేశారు. దీంతో చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి పలు రైళ్లను మళ్లించారు. 100 రోజుల పాటు ఈ ఆరు ప్లాట్‌ఫామ్‌లు (six platforms) మూసి వేయనున్నారు.
Railway Passengers | 120 రైళ్ల దారి మళ్లింపు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆదునికీకరణలో భాగంగా లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్‌ఓవర్ వంతెన పనులు చేపడుతున్నారు. దీంతో ఆరు ప్లాట్‌ఫామ్స్ మూసి వేశారు. ఈ నేపథ్యంలో 120 రైళ్లను దారిమళ్లించి వేరే స్టేషన్ల నుంచి నడపనున్నారు. వీటిలో ఎక్కువ శాతం ట్రైన్లు చర్లపల్లి టెర్మినల్(Cherlapalli Terminal) నుంచి రాకపోకలు సాగించనున్నాయి. నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి మరికొన్ని నడవనున్నాయి.