అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Railway Passengers | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ Secunderabad Railway Stationలో ఆధునికీకరణ పనుల నేపథ్యంలో పలు ప్లాట్‌ఫామ్ Platformలను మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో పలు రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లించారు.
నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ స్టేషన్‌లో Secunderabad station ప్రస్తుతం అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. దీంతో 7, 8, 9, 10 ప్లాట్ ఫామ్లను platforms మూసివేశారు. అలాగే 5, 6వ నంబర్ ప్లాట్‌ఫామ్‌లను కూడా అవసరాలకు మేరకు బంద్ చేయనున్నారు. మొత్తం ఆరు ప్లాట్‌ఫామ్‌లు మూసి ఉండనున్నాయి. దీంతో సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే పలు రైళ్ల రాకపోకలపై 120 రోజుల పాటు ఆంక్షలు ఉండనున్నాయి. దీంతో పలు రైళ్లు ఇక నగరంలోని వేరే స్టేషన్ల other stations నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి.
Railway Passengers | టెర్మినల్ మార్చిన ట్రెయిన్లు
నాంపల్లి నుంచి చెన్నై సెంట్రల్‌కు Nampally to Chennai Central నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్–హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌కు Cherlapally Terminal మార్చారు. అలాగే విజయవాడ–సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ Vijayawada-Secunderabad Express కాచిగూడ నుంచి, పోర్‌బందర్–సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ఉందానగర్ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్–కర్నూల్ సిటీ కాచిగూడ నుంచి రాకపోకలు సాగించనుంది. సిద్దిపేట్ నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే ప్యాసింజర్ రైళ్లు ఇక నుంచి మల్కాజిగిరి నుంచి నడుపుతారు. సికింద్రాబాద్ పుణే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ Secunderabad Pune Shatabdi Express నాంపల్లి నుంచి నడవనుంది.
Railway Passengers | చర్లపల్లి నుంచి నడిచే ట్రెయిన్ల వివరాలు
సికింద్రాబాద్–దర్భంగా, సికింద్రాబాద్–యశ్వంత్‌పూర్, సికింద్రాబాద్–మణుగూర్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–రేపల్లె, సిలిచర్–సికింద్రాబాద్, సికింద్రాబాద్–అగర్తల, సికింద్రాబాద్–ముజఫర్‌పూర్, సికింద్రాబాద్–దానాపూర్, సికింద్రాబాద్–సంత్రాగచ్చి, హైదరాబాద్–రక్సాల్ ఎక్స్‌ప్రెస్ చర్లపల్లి Cherlapalli నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్, గుంటూర్–సికింద్రాబాద్ రైళ్లకు చర్లపల్లి టెర్మినల్‌లో Cherlapalli terminal అదనపు హాల్టింగ్ సదుపాయం కల్పించారు.
Railway Passengers | పలు రైళ్ల దారి మళ్లింపు
టెర్మినల్ మార్చడంతో పాటు సికింద్రాబాద్ Secunderabad మీదుగా నడిచే పలు రైళ్లను అధికారులు ఇతర స్టేషన్ల మీదుగా మళ్లించారు. 32 రైళ్లను చర్లపల్లి Cherlapalli మీదుగా మళ్లించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ రైళ్లు సికింద్రాబాద్‌కు Secunderabad రాకుండా లింగంపల్లి నుంచి సనత్‌నగర్ Lingampalli via Sanathnagar, మౌలాలి రూట్‌లో చర్లపల్లికి చేరుకుంటాయి. ఆదిలాబాద్–తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్, విశాఖపట్టణం–సాయినగర్ షిరిడీ, విశాఖపట్టణం–నాగర్‌సోల్, నర్సాపూర్–నాగర్‌సోల్, వాస్కోడిగామ –జాసిఢ్, మచిలీపట్నం–సాయినగర్ షిరిడీ, కాకినాడ–సాయినగర్ షిరిడీ, విశాఖపట్టణం–ఎల్‌టీటీ ముంబై, పూర్ణ–తిరుపతి, లింగంపల్లి–కాకినాడ గౌతమి ఎక్స్‌ప్రెస్, కాజీపేట్–హడాప్సర్, లింగంపల్లి–విశాఖపట్టణం, సంబాల్పూర్–నాందేడ్, విశాఖపట్టణం–నాందేడ్, నాందేడ్–ఈరోడ్, కాకినాడ – లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ రైళ్లు చర్లపల్లి మీదుగా రాకపోకలు సాగించనున్నాయి.