ఆల్ఫోర్స్ కళాశాలకు గుర్తింపు లేదు

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ నగరంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఎలాంటి గుర్తింపు లేదని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ స్పష్టం చేశారు. ఈ విషయమై పలు విద్యార్ది సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము పరిశీలన చేశామని, ఇంతవరకు అడ్మిషన్లకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని, అనుమతి లేని కళాశాలలో తమ పిల్లలను చేర్పించి ఇబ్బందులకు గురి కావొద్దని ఆయన సూచించారు.