అక్షరటుడే, హైదరాబాద్: GHMC : అకాల వర్షాల కారణంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. దీంతో రోడ్లు జలమయమయ్యాయి.
ఈ నేపథ్యంలో మేయర్ సహా అధికారులు అలర్ట్ అయ్యారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్లతో మేయర్ విజయలక్ష్మీ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో అకాల వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితిపై మేయర్ సమీక్షించారు. జోన్ల వారీగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.