అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తుతుండడంతో అన్ని గేట్లను ఎత్తివేశారు. ఉదయం 8 గేట్లు ఎత్తగా.. కొంతసేపటి తర్వా 26 గేట్లకు పెంచారు. మధ్యాహ్నం 40 గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 1,95,767 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. 1,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరిలో వరదనీరు ఉరకలెత్తుతోంది. ప్రాజెక్టు, నదీ పరీవాహక ప్రాంత ప్రజలు నది వైపు వెళ్లవద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.