అక్షరటుడే, వెబ్‌డెస్క్: Allahabad High Court : మహిళల ఎదను తాకడం, యువతి పైజామాను లాగడం లాంటి చేష్టలు అత్యాచార యత్నం కిందకు రావంటూ వివాదాస్పద తీర్పునిచ్చిన అలహాబాద్ హైకోర్టు allahabad highcourt (ఉత్తర్ ప్రదేశ్).. ఇలాంటి తరహా కేసుతో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. అత్యాచార కేసు విచారణ సందర్భంగా బాధితురాలిది కూడా తప్పు ఉందని పేర్కొంటూ నిందితుడికి బెయిల్ మంజూరు చేయడం ఇందుకు కారణం.
తన క్లాస్మేట్ అత్యాచారం చేశాడని ఢిల్లీలో dellhi student పీజీ చదువుతున్న ఓ విద్యార్థిని కేసు పెట్టింది. మద్యం మత్తులో ఉన్న తనను అతని బంధువుల ఇంటికి తీసుకెళ్లి రెండుసార్లు అత్యాచారం చేశాడనేది బాధితురాలి ఆరోపణ. కాగా, సాక్ష్యాల పరిశీలనలో అది అబద్ధమని, పరస్పర అంగీకారంతో ఇద్దరూ కలిశారని నిందితుడి తరఫు లాయర్ వాదించారు.
ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం కీలక అంశాలను ప్రస్తావించింది. “ఈ కేసులో బాధితురాలు పీజీ చదువుతున్న యువతి. తప్పొప్పుల గురించి ఆమెకు తెలుసు. ఒకవేళ బాధితురాలి ఆరోపణే నిజం అనుకున్నా.. సమస్యను ఆమెనే స్వయంగా ఆహ్వానించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందుకని జరిగిన దానికి ఆమె కూడా బాధ్యురాలే. ఇది ముమ్మాటికీ బాధితురాలి స్వయంకృతాపరాధమే”
వైద్య పరీక్షలో లైంగిక వేధింపులు జరిగినట్లుగా వైద్యులు ఎలాంటి ఆధారాలు చూపలేదు. ఇక, ఈ కేసులోని నిందితుడికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. బెయిల్ షరతులను ఉల్లంఘించడనే హామీతో పాటు, సాక్ష్యాలను ప్రభావితం చేయడన్న నమ్మకం కుదిరినందున నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నాం.. అని జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ justice sanjay kumar singh పేర్కొన్నారు.
ఈ కేసును పరిశీలిస్తే.. గతేడాది సెప్టెంబరులో ఈ ఘటన జరిగింది. బాధిత యువతిని ఆమె స్నేహితులు హౌజ్ ఖాస్ లోని ఓ రెస్టారెంట్ కు ఆహ్వానించారు. అర్ధరాత్రి 3 గంటల దాకా ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమె చిత్తుగా తాగింది. బాగా మద్యం తాగడంతో మత్తులో ఉన్న ఆమె తన గదికి వెళ్లలేక, ఓ స్నేహితుడిని అతని ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. అలా, మత్తులో ఉన్న ఆమెను నిందితుడు తన బంధవుల ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడనేది బాధితురాలి ఆరోపణ.
ఈ కేసులో గతేడాది డిసెంబరు నుంచి నిందితుడు జైల్లో ఉన్నాడు. గత మార్చి 11న ఈ కేసు విచారణ సందర్భంగా.. పైవిధంగా వ్యాఖ్యలు చేసి మరీ, నిందితుడికి అలహాబాద్ హైకోర్టు బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. కాగా, పలు ఆంగ్ల మీడియా వరుస కథనాలతో ఇప్పుడు హైలైట్ అవుతోంది.
ఈ లెక్కన పరిశీలిస్తే.. ఇదే కోర్టుకు చెందిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా(Justice Ram Manohar Narayan Mishra) ఇచ్చిన వివాదాస్పద తీర్పు కంటే ముందే ఈ కేసు విచారణ జరిగిందని స్పష్టం అవుతోంది. మార్చి 17న ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచార యత్నం కేసు విచారణ సందర్భంగా.. జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేసి, తీర్పునిచ్చారు. మహిళలను తాకినంత మాత్రాన, పైజామా తాడు తెంపేసినంత మాత్రాన అత్యాచారయత్నం కిందకు రాదంటూ పేర్కొన్నారు.
కాగా, ఈ తీర్పును సుమోటో(judgment suomoto)గా స్వీకరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం(సుప్రీం కోర్టు Supreme Court of india), తీర్పుతో పాటు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ స్టే విధించింది.