
Allu Arjun – Sneha Reddy : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి జంట ఒకటి. కులాలు వేరు అయినా.. వీళ్లిద్దరు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా ఉంటున్నారు. మార్చి 6న అల్లు అర్జున్, స్నేహారెడ్డిలు పెళ్లి చేసుకోగా, తాజాగా వారిద్దరు తమ 14వ వివాహా వార్షికోత్సవాన్ని కేక్ కట్ చేసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అనే విషయం మనకు తెలిసిందే. అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలు చూస్తే.. అది నిజమే అని మనకు అనిపిస్తుంది. వారిద్దరు కూడా ఇతరులు అసూయ పడే అప్యాయతల నడుమ, అన్యోన్యంగా వారి వివాహా బంధం కొనసాగిస్తున్నారు.
Allu Arjun – Sneha Reddy : క్రేజీ కపుల్..
అల్లు అర్జున్ ఐకాన్‌స్టార్‌గా, ప్రపంచ ప్రఖ్యాతి పొందటంలో, భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన హీరోగా బన్నీ ఎదగడంలో ఆయన భార్య స్నేహా రెడ్డి సపోర్ట్ మరువలేనిది.వీరి లవ్ స్టారీ గురించి చూస్తే.. అల్లు అర్జున్ , స్నేహ రెడ్డిల ప్రేమకథ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మొదలయ్యింది. కామన్ ఫ్రెండ్ పెళ్లిలో వీరు కలుసుకున్నారు. అల్లు అర్జున్ స్నేహను మొదటి చూపులోనే ప్రేమించాడు, అలా తన ప్రేమని కొనసాగించాడు. పెళ్లిలో కలుసుకున్నప్పుడు వీళ్లద్దరు మధ్య మాటలు కలిసాయట. ఆ తర్వాత అదే కపుల్.. ఒక రోజు పార్టీకి వీరిద్దరిని పిలిచారట. ఆ రోజు నుంచి వీళ్లమధ్య రిలేషన్ ఇంకాస్త ముందుకు జరిగిందని సమాచారం.
పీకల్లోతు ప్రేమలో మునిగాక వీరిద్దరు పెద్దల ఒప్పందంతో 2010 లో నిశ్చితార్థం చేసుకున్నారు, 2011 లో వీళ్ళ పెళ్లి చాలా ఘనంగా జరిగింది. ఇక వీరిద్దరి వైవాహిక జీవితంలో అర్హ, అయాన్ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పెళ్లైన దగ్గర నుండి బన్నీ తన కుటుంబానికి ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి ఫ్యామిలీతో కలిసి విదేశి యాత్రలకి వెళ్తాడు. షూటింగ్ లేనప్పుడు పిల్లలతో కలిసి సరదగా గడుపుతూ ఉంటాడు.