అక్షర టుడే, వెబ్ డెస్క్ : Allu arjun : పుష్ప-2 సినిమాతో ఐకాన్ స్టార్‌గా మంచి పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు. పుష్ప-2 విడుదలై చాలా రోజులు అయిన ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై అందరిలో అనేక అనుమానాలు ఉన్నాయి. త్రివిక్రమ్‌తో చేస్తాడా, లేకుంటే అట్లీతో చేస్తాడా అన్న చర్చ నడుస్తుంది.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల బన్నీ వాసు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. త్రివిక్రమ్-అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన అప్డేట్లు అఫీషియల్‌గా ప్రకటిస్తామని, అధికారిక ప్రకటన రాకముందే ఈ సినిమా గురించి ఏమి మాట్లాడలేమని పేర్కొన్నారు.
Allu arjun : హిస్టారికల్ ప్రాజెక్ట్‌లో..
ఇక అట్లీతో కూడా అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. వీరే కాక పలువురు దర్శక నిర్మాతలు కూడా అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అయితే ఏ హీరోతో చేయాలనే దానిపై సందిగ్ధంలో ఉన్నారు బన్నీ. ఆయన అభిమానులు బన్నీ ఓ భారీ బడ్జెట్ చిత్రం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. సుమారు ఓ వెయ్యి కోట్లతో బన్నీ హీరోగా హిస్టారికల్ మూవీ చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు.
ఇదే ప్రశ్న తాజాగా బన్నీ వాసుకి రిపోర్టర్ నుండి ఎదురు కాగా, దానికి బన్నీ వాసు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “ఆయనతో సినిమా చేయాలంటే ఇంకో మూడు నాలుగేళ్ల సమయం పడుతుంది. అశోక చక్రవర్తి అలాంటి సినిమా చేయాలంటే వెయ్యి కోట్లు రిస్క్ చేయాలి. అయితే అల్లు అరవింద్ గారు ఇప్పుడున్న ఏజ్, హ్యాపీ మూడ్‌లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ నెత్తి మీద వేసుకుంటారనేది చూడాలి” అని బన్నీ వాసు పేర్కొన్నారు. కనీసం వేరే నిర్మాతలు అయినా బన్నీతో హిస్టారికల్ చిత్రం చేస్తే బాగుండని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.