Advertisement

అక్షరటుడే, నిజాంసాగర్: మండలంలోని అచ్చంపేట్, నిజాంసాగర్ గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను శుక్రవారం నిజాంసాగర్ మండల వ్యవసాయ శాఖ అధికారి అమర్ ప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో స్టాక్ రిజిస్ట్రర్లు, బిల్ బుక్​లను పరిశీలించారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసిన సమయంలో విధిగా బిల్లులు ఇవ్వాలని, దుకాణాల ఎదుట ధరల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు.

Advertisement