అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | కామారెడ్డి జిల్లాలో అనేక సమస్యలు problems నెలకొన్నాయి. నిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పెండింగ్ పనులను పూర్తి చేయడం లేదు. మరోవైపు జిల్లా కేంద్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. మంగళవారం జిల్లాకు ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు Jupally Krishna Rao వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.
కామారెడ్డి నియోజకవర్గం Kamareddy constituency నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు అంతంతమాత్రంగానే వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. కామారెడ్డి మున్సిపాలిటీలో Kamareddy Municipality తాగునీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. పైప్ లైన్లు Pipelines పగిలిపోయి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు డ్రెయినేజీ వ్యవస్థ drainage system సరిగ్గా లేదు. దీంతో వర్షాలు పడిన సమయంలో మురుగు నీరు, వరద నీర్లు రోడ్లపై పారుతోంది.
Kamareddy | వేధిస్తున్న ట్రాఫిక్ సమస్య
కామారెడ్డి జిల్లా కేంద్రంగా district center మారడంతో ట్రాఫిక్ కూడా పెరిగింది. పట్టణంలో జంక్షన్ల నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. రోడ్లు విస్తరణకు నోచుకోవడం లేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని పెద్ద చెరువు మినీ ట్యాంక్‌బండ్‌గా mini tank bund మారడం కలగానే మిగిలిపోయింది. ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజీ 21, 22 పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
Kamareddy | నిధులు లేక.. పనులు సాగక
బాన్సువాడ నియోజకవర్గంలోని Banswada constituenc సిద్దాపూర్ రిజర్వాయర్ Siddapur reservoir పనులకు ప్రభుత్వం రూ.220 కోట్లు కేటాయించింది. కానీ నిధులు విడుదల చేయలేదు. దీంతో మూడున్నరేళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి.
Kamareddy | రోడ్లకు మోక్షమెప్పుడో..
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని YellaReddy constituency చాలా రోడ్లు అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో విస్తరణకు నోచుకోవడం లేదు. మెదక్– కామారెడ్డి Medak-Kamareddy జిల్లా కేంద్రాలకు వెళ్లే మార్గంలో రాజంపేట మండలం కొండాపూర్– ఆర్గొండ Kondapur and Argonda మధ్య అటవీ ప్రాంతంలో రోడ్డు విస్తరణ ఏళ్లుగా సాగడం లేదు. అటవీ శాఖ forest department అనుమతులు రాకపోవడంతో సుమారు ఐదు కిలోమీటర్లు సింగిల్రోడ్డులో single road ప్రమాదకరంగా ప్రయాణించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే అయ్యపల్లి తండా-మెంగారం Ayyapalli Thanda-Mengaram చౌరస్తా, మెంగారం-బోనాల్ రోడ్డు పనులు నిలిచిపోయాయి. కామారెడ్డి-కరీంనగర్-ఎల్లారెడ్డి జాతీయ రహదారి పనులు కాగితాలకే పరిమితమయ్యాయి.
Kamareddy | విత్తనోత్పత్తి కేంద్రానికి పూర్వ వైభవం వచ్చేనా?
నిజాంసాగర్ ప్రాజెక్ట్ Nizamsagar project పర్యాటక శోభ కళ తప్పుతోంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి YS Rajasekhara Reddy హయాంలో 540 ఎకరాలను బృందావన్ కోసం కేటాయించారు. అయితే పనులు మాత్రం ఇప్పటి వరకు చేపట్టలేదు. గతంలో ప్రాజెక్టులో బోటు వసతులు ఉండేవి. ఇప్పుడన్నీ కనుమరుగయ్యాయి. ప్రాజెక్టు కింద మత్స్యకారుల fishermen కోసం ఏర్పాటు చేసిన విత్తనోత్పత్తి కేంద్రం మూతబడింది. ఈ విత్తనోత్పత్తి కేంద్రంపై నిజాంసాగర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, సంగారెడ్డి ప్రాంతాల నుంచి 2,100 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి.
Kamareddy | ఇష్టారాజ్యంగా కల్తీకల్లు విక్రయం
రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు Minister Jupally Krishna Rao జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్నారు. ఆయన ఇలాకలోనే కల్తీకల్లు విక్రయాలు జోరుగా సాగుతుండటం గమనార్హం. జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని Jukkal and YellaReddy constituencies పలు గ్రామాల్లో ఇటీవల కల్తీ కల్లు తాగి సుమారు 100 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. జిల్లాలో ఇష్టారాజ్యంగా కల్తీకల్లు విక్రయాలు చేపడుతున్నారు.