Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన అంబ‌టి.. విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతూ..!!

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన అంబ‌టి.. విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతూ..!!
Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన అంబ‌టి.. విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతూ..!!

అక్షర టుడే, వెబ్ డెస్క్ Pawan Kalyan : కూటమి ప్రభుత్వం (Coalition government) నిర్వహించిన ‘పీ4-జీరో పావర్టీ’ కార్యక్రమం చంద్రబాబు (Chandrababu) తాజా అతిపెద్ద పబ్లిసిటీ స్టంట్‌ అని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు (Ambati Rambabu) విమ‌ర్శ‌లు చేశారు. తాజాగా ఆయ‌న గుంటూరు క్యాంప్ కార్యాల‌యంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శి-బంగారు కుటుంబంలో మార్గదర్శి అంటే రామోజీరావుకు చెందిన ఆర్థిక నేరాలతో కోర్ట్ కేసులు ఎదుర్కొంటున్న సంస్థే గుర్తుకు వస్తోందని అన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు రోడ్లపై కొత్త టోల్‌గేట్లు పెడుతున్నారు. ప్రభుత్వ రంగంలో నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను, గ్రామీణ రహదారులను కూడా పీ4 పేరుతో ప్రైవేటీకరిస్తున్నారు.

Advertisement
Advertisement

Pawan Kalyan : సెటైరిక‌ల్ కామెంట్స్..

పేదరిక నిర్మూలన అంటే ఆ ప్రాంత ప్రజల జీవనోపాధులను మెరుగుపరచడం, ఉచిత విద్య, వైద్యం, వారికి పని కల్పించడం. ఇటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. దీనిని గత ప్రభుత్వంలో వైయస్ జగన్ అమలు చేసి చూపించారు. పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. ప్రభుత్వం ఎంతో బాధ్యతగా పేదలను ఆర్థిక స్వావలంభన దిశగా నడిపించే కార్యక్రమాల్లో భాగస్వాములను చేశారే తప్ప (Chandrababu) చంద్రబాబులా ఆ బాధ్యత నుంచి పారిపోయే కార్యక్రమం చేయలేదు. తనకు సత్తా లేదని, చంద్రబాబుకు మాత్రమే సత్తా, పాలనా సామర్థ్యం ఉందని, ఆయన జీవితాంతం సీఎంగా ఉండాలని, తాను కింద ఉండి సేవ చేస్తానని స్వయంగా పవన్ కళ్యాణ్ Pawan Kalyan ప్రకటించుకున్నారు. మరోవైపు పవన్ అభిమానాలు తమ నాయకుడు సీఎం కావాలని అరుస్తుంటారు. ఇది (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ వింటే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Ram Charan - Allu Arjun : రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డేతో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డ అల్లు-మెగా వివాదం..!

పవన్ కళ్యాణ్ స్వయంగా తనకు సామర్థ్యం లేదు, చంద్రబాబు (Chandrababu) మాత్రమే సమర్థుడు అని చాటారు. అలాంటప్పుడు సీఎం కావాలని(Pawan Kalyan) పవన్ అభిమానులు ఎలా అనుకుంటారు? ఈ సందర్బంగా సీ.నారాయణరెడ్డి రాసిన ఒక గేయం ఈ సందర్భంగా గుర్తుకు వస్తోంది. ‘కరగనిదే కొవ్వోత్తి కాంతిని ఎలా ఇస్తుంది… మరగనిదే నీరు ఎలా మబ్బురూపు దాలుస్తుంది… నలగనిదే అడుగులు ఎలా నర్తించబడతాయి… మలచనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది…?’ సామర్థ్యం పెంచుకునే ప్రయత్నం చేసే ఆలోచనే (Pawan Kalyan) పవన్ కళ్యాణ్‌కు లేదు. జనసేన సైనికులు Janasainiks, కాపు సోదరులు దీనిని అర్ధం చేసుకోవాలి. ఎక్కడా పవన్ కళ్యాణ్ అసమర్ధుడు అని మేం అనడం లేదు. ఆయనే తనకు పాలించే సత్తా లేదని, సీఎంగా చంద్రబాబు మాత్రమే సమర్ధుడు అని చాటుతున్నాడు . ప్రభుత్వంలో వసూళ్ళు, బదిలీలు, కమీషన్లు అన్నీ పప్పురాజా నారా లోకేష్ చేస్తున్నారు. దీనిలోంచి ప్యాకేజీ రాజా పవన్ కళ్యాణ్‌కు వాటా పంపుతున్నారు అంటూ ప‌లు విమ‌ర్శ‌లు చేశారు అంబ‌టి.

Advertisement