
అక్షరటుడే, వెబ్‌డెస్క్ Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సంచలనంగా మారిన వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి Vijaya Sai Reddy రీసెంట్‌గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి YS Jagan Mohan Reddy పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోటరీకి అనుకూలంగా ఉంటేనే జగన్ దగ్గరికి తీసుకుంటారు. కోటరీ మాటలు వినొద్దని జగన్‌కు ఎన్నోసార్లు చెప్పినా ఆయన వినడం లేదు. ఏ రోజు చెప్పుడు మాటలని నాయకుడు వినకూడదు. జగన్ మనసులో నాకు స్థానం లేదని బయటకు వచ్చేసాను. విరిగిన మనసు మళ్లి అతుక్కోదు అంటూ విజయసాయి రెడ్డి Vijaya Sai Reddy ఆవేదనతో మాట్లాడారు. ఇంకేముంది వైసీపీ YCP నాయకులు రివర్స్ కౌంటర్స్ ఇవ్వడం మొదలు పెట్టేశారు.
Ambati Rambabu : ఇంకెంతమంది..
కాకాణితో పాటు గుడివాడ అమర్నాథ్ ఇప్పటికే Vijaya Sai Reddy విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా అంబటి రాంబాబు కూడా విజయసాయి రెడ్డిని విమర్శించారు. పార్టీలో విజయసాయిరెడ్డే కోటరీ, ఆయనతో పాటే కోటరీ వెళ్లిపోయింది. వైసీపీ YCP పెట్టకముందు విజయసాయిరెడ్డి కేవలం ఆడిటర్ మాత్రమే. పార్టీలోకి వచ్చాక ఎన్నో పదవులు పొందారు. పార్టీ నుంచి వెళ్లిపోయారు కాబట్టి బురద చల్లడం సహజం అని Ambati Rambabu అంబటి రాంబాబు తనదైన శైలిలో విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలలో ఓడిపోవడం, ఫిరాయింపులు, కేసులు అనే మూడు కారణాలతో నష్టపోతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.
అయితే అధినేతకి పార్టీ నేతలకు గ్యాప్ పెరగడం వలన కలిగే నష్టం మరొకటి ఉంది. వైసీపీలో అదే జరిగిందని చిరకాలం జగన్‌కి కుడి భుజంగా చేసిన విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీలో విజయసాయి రెడ్డి కూడా చాలా కాలం ఆ కోటరీలో ఉంటూ వచ్చారు. అప్పుడు ఆయన కూడా ఇంచుమించు ఇలాగే వ్యవహరించారు.కాబట్టి వైసీపీ పతనానికి అందరితో పాటు ఆయన కూడా కారకుడే అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అధికారం కోల్పోయి 9 నెలలవుతున్నా ఇంతవరకు ప్రజల మద్యకు, శాసనసభ సమావేశాలకు జగన్ వెళ్లకపోవడం వైసీపీకి కాస్త నెగెటివ్‌గా మారుతుందని, అవే తప్పులు చేస్తూ ఉండడం వలన జగన్ కోటరి నుండి బయటకు రాలేకపోతున్నారని విజయ్ సాయి రెడ్డి చెప్పినట్టుగా అర్ధమవుతుంది.
విజయసాయిరెడ్డి కామెంట్స్ పై అంబటి రియాక్షన్
పార్టీలో విజయసాయిరెడ్డే కోటరీ
ఆయనతో పాటే కోటరీ వెళ్లిపోయింది
వైసీపీ పెట్టకముందు విజయసాయిరెడ్డి కేవలం ఆడిటర్ మాత్రమే
పార్టీలోకి వచ్చాక ఎన్నో పదవులు పొందారు
పార్టీ నుంచి వెళ్లిపోయారు కాబట్టి బురద చల్లడం సహజం
– అంబటి రాంబాబు pic.twitter.com/tJEMLUUX1l
— BIG TV Breaking News (@bigtvtelugu) March 13, 2025