అక్షరటుడే, ఇందూరు: Giriraj College | గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Giriraj Government Degree College)లో గురువారం అంబేడ్కర్ జయంతి(Ambedkar Jayanti) నిర్వహించారు. కళాశాలలోని అంబేడ్కర్ ప్రాంతీయ కేంద్రంలో సామాజిక సాధికారత వారోత్సవాలను ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు ‘భారత రాజ్యాంగం సామాజిక న్యాయం'(Indian Constitution and Social Justice) అనే అంశంపై వ్యాసరచన పోటీలు(Essay Writing Competition) నిర్వహించారు.
కార్యక్రమంలో ప్రాంతీయ సమన్వయకర్త రంజిత, కళాశాల అకాడమిక్ కో–ఆర్డినేటర్ గంగాధర్, కామర్స్ విభాగాధిపతి వినయ్ కుమార్, తెలుగు విభాగాధితి రామస్వామి, దండు స్వామి, ఉదయభాస్కర్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.