అక్షరటుడే, వెబ్ డెస్క్: విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే ఎస్సీ పేద విద్యార్థులు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. ఈనెల 14 నుంచి అక్టోబర్ 13 వరకు గడువు ఉందన్నారు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ దేశాల్లోని విశ్వ విద్యాలయాల్లో చదవాలనుకునే వారికి ఈ పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. జీఆర్ఈ/జీమ్యాట్ లేదా టోఫెల్, ఐఈఎల్టీఎస్ లో అర్హత స్కోర్ తో పాటు, డిగ్రీలో 60 శాతం మార్కులు పొంది ఉండాలన్నారు. అలాగే కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షలకు మించవద్దని, కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే స్కాలర్ షిప్ వర్తిస్తుందన్నారు. పాస్ పోర్ట్, వీసాతో పాటు యూనివర్సిటీ/సంస్థ నుంచి అడ్మిషన్ లెటర్ కలిగి ఉండాలన్నారు. ఆసక్తిగల ఎస్సీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.