అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : అమెరికన్‌ కంపెనీ ఉబెర్‌ మహిళలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. బైక్ రైడ్-హెయిలింగ్ యాప్‌ ఉబెర్‌ తాజాగా ‘ఉబెర్‌ మోటో ఉమెన్‌’ అనే కొత్త సర్వీస్‌ను తీసుకువచ్చింది. మొదటిసారిగా బెంగుళూరులో మహిళలకు ఈ సర్వీస్‌ను అందిస్తోంది. త్వరలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌ సహా ప్రముఖ నగరాల్లో ఈ సర్వీసును తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. మహిళా డ్రైవర్‌లకు అవకాశం ఇవ్వడమే కాకుండా డబ్బు సంపాదించే మార్గాన్ని కల్పిస్తున్నామని ఉబెర్‌ కంపెనీ ప్రతినిధి తెలిపారు.