అక్షరటుడే, బోధన్: అమృత్‌భారత్ స్టేషన్ పథకంలో భాగంగా బోధన్‌లోని గాంధీపార్కు రైల్వే స్టేషన్ సమీపంలో ఆర్వోబీ నిర్మాణ పనులకు సోమవారం ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మాశరత్‌రెడ్డి, బీజేపీ నేత మేడపాటి ప్రకాశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైల్వేస్టేషన్లను పునరాభివృద్ధి చేస్తోందని, అవసరమైన ప్రతీ చోట ఆర్వోబీలను నిర్మిస్తోందన్నారు. ఇందులో భాగంగా బోధన్‌లో ఆర్వోబీ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఐదు ఆర్వోబీల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, బోధన్ ఆర్వోబీ ఆరోవదని పేర్కొన్నారు. పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో నవీపేట, ఎడపల్లి పనులను సైతం ప్రారంభించుకునేలా ప్రయత్నాలు చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.