అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఓ నిందితుడు గంజాయితో పట్టుబడ్డాడు. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తనిఖీ చేయగా 210 గ్రాముల గంజాయి లభించింది. దానిని విక్రయించేందుకు తెచ్చినట్లు విచారణలో తేలింది. నిందితుడిని మోపాల్ మండలం శ్రీరాంనగర్ తండాకు చెందిన భామన్ జైల్ సింగ్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో ఠాణా ఇన్స్పెక్టర్ రఘుపతి తెలిపారు.