అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలోని ముక్కా అయోధ్య రాంగుప్తా విద్యానికేతన్ పూర్వ విద్యార్థులు శనివారం సమ్మేళనం నిర్వహించారు. పాఠశాలకు చెందిన 1998-99 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు అంతా ఒక్కచోట కలుసుకుని, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం గురువులను ఘనంగా సన్మానించారు.