అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: ఇందల్వాయి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో తిర్మన్‌పల్లి గిరిజన బాలికల పాఠశాల, కళాశాలలో గురువారం రక్తహీనతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎనీమియా ముక్తభారత్ కింద 220 మంది బాలికలకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించినట్లు హెచ్‌ఈవో శంకర్ తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ అక్బర్ అలీ, పాఠశాల హెచ్‌ఎం పద్మ, ఆరోగ్య సిబ్బంది శారద, ఫార్మసిస్ట్ మౌనిక, సుమలత, స్రవంతి, ఆశ కార్యకర్త ప్రమీల ఉన్నారు.