అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆఫ్ఘనిస్థాన్‌లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది. 160 కిలోమీటర్ల లోతులో తెల్లవారుజామున 4:43 గంటలకు భూకంపం వచ్చిందని పేర్కొంది. దీని కేంద్రం అక్షాంశం 36.12 ఎన్, రేఖాంశం 71.16 ఈ వద్ద నమోదైంది.