అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: రెడ్డి కులస్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న దిష్టిబొమ్మను చందూర్​ మండల కేంద్రంలో దహనం చేశారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం నాయకులు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్నకు ధైర్యం ఉంటే.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రెడ్డిల ఓట్లు లేకుండా గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కులాల మధ్య చిచ్చుపెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు.