అక్షరటుడే, ఆర్మూర్‌: ప్రమాదవశాత్తు కాలువలో పడి వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన పెర్కిట్‌లో చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్‌ వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా సిబ్దారా గ్రామానికి గాంధీ సమాన్వాడు(60) కూలీ పని చేసుకుంటూ పెర్కిట్‌లో జీవిస్తున్నాడు. శనివారం సాయంత్రం పెర్కిట్‌లోని మాటు కాలువలో చేపల వేటకు వెళ్లగా..ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Congress Armoor | భారతీయులను ఏకం చేయడమే లక్ష్యం