అక్షరటుడే, భిక్కనూరు: మండల కేంద్రంలోని స్థానిక బొబ్బిలి చెరువులో పడి వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన ప్రకారం.. మండలంలోని తిప్పాపూర్ కు చెందిన జుర్రిగల దుర్గమ్మ(66), భర్త మల్లయ్య కొంత కాలం నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఏడాదికాలంగా మల్లయ్యకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో తిప్పాపూర్ కు వచ్చేశారు. అయితే ఆయన ఆరోగ్యం నయం కావడంతో మళ్లీ హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం ఉదయం తిప్పాపూర్ నుంచి భిక్కనూరుకు వచ్చి చిన్న కూతురు ఇంటికి వెళ్లారు. దుర్గమ్మ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న బొబ్బిలి చెరువు వద్దకు వెళ్లగా.. నీటిలో పడి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.