అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని బేతాళ స్వామి కాలనీ వద్ద మంగళవారం రాత్రి ఎలక్ట్రిక్ స్కూటీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో స్కూటీపై ఉన్న తండ్రికూతురు అప్రమత్తమై వాహనాన్ని వదిలి పరుగులు పెట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. స్కూటీ పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.

Advertisement
Advertisement

Advertisement