అక్షరటుడే, ఎల్లారెడ్డి: రెండు ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువులు సాధించి నెలలు గడవకముందే ఓ ఉద్యోగి అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ ఘటన నాగిరెడ్డిపేట మండలం మాటూర్ మాసంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మాటూర్ మాసంపల్లికి చెందిన యాదగిరి నాలుగు నెలల క్రితం వెలువడిన గురుకుల పాఠశాల ఫలితాల్లో ఉద్యోగం సాధించి లింగంపేట మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలలో విధులు నిర్వహించాడు. ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో గణిత విభాగంలో జిల్లాలో మొదటి ర్యాంకు సాధించాడు. లింగంపేట బాలుర ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాడు. అనారోగ్యంతో మరుసటి రోజు నుంచి సెలవు పెట్టాడు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి మృతి చెందాడు.