అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: చత్తీస్‌గడ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య శుక్రవారం ఉదయం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు. వారి నుంచి భద్రత బలగాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సుందర్ రాజ్ తెలిపారు.