అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో ఏడేళ్ల బాలికపై 50 ఏళ్ల వ్యక్తి బుధవారం సాయంత్రం అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద హనుమాన్ మందిర్ ఎదురుగా ఓ పాడుబడ్డ ఇంటి ఆవరణలో బాలికకు ఓ వ్యక్తి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. అటుగా వెళ్తున్న స్థానిక యువకుడు గమనించి నిలదీయడంతో తప్పయిందంటూ పారిపోయాడు. యువకుడు తేరుకునేలోపే పరారయ్యాడు. బాలిక ఎవరనే వివరాలు తెలియాల్సి ఉంది.