అక్షరటుడే, కామారెడ్డి: అప్పులు చెల్లించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కామారెడ్డి పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన కొండ పవన్‌ కుమార్‌ (42) రెండేళ్లుగా కామారెడ్డిలోని కేపీఆర్‌ కాలనీలో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నాడు. ఇంటి నిర్మాణానికి బ్యాంకు నుంచి రుణం తీసుకోవడంతో పాటు తెలిసిన వారి వద్ద కూడా అప్పు చేశాడు. ఆ అప్పులు చెల్లించలేక, మరోవైపు పనిదొరక్క బాధపడేవాడు. గురువారం అతని భార్య రెడ్డిపేటకు వెళ్లగా.. ఇంటి వద్ద ఒక్కడే ఉన్న పవన్‌ కుమార్‌ బెడ్‌ రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.