అక్షరటుడే, నిజాంసాగర్: ఇంటి బయట నిద్రిస్తుండగా దొంగలు రాడ్లతో కొట్టి చోరీ చేసిన ఘటన పిట్లం మండలం సిద్ధాపూర్ తండాలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన కేతావత్ గోపాల్ ఇంటి బయట నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి రాడ్లతో కొట్టారు. అనంతరం ఇంట్లోకి చొరబడి ఆయన భార్యకు సంబంధించిన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బాధితుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.