అక్షరటుడే, ఆర్మూర్: నందిపేట మండలం కుద్వాన్‌పూర్‌ కు చెందిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామానికి చెందిన సుకృత్(22) ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన రజితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దీంతో శుక్రవారం పోలీసులు ఇద్దరిని స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే భర్త దగ్గరికి వెళ్లడానికి రజిత ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన సుకృత్ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే గడ్డి మందు తాగాడు. దీంతో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.