అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : నగరంలోని పాల డెయిరీలో కొన్న దూద్‌పేడా తిన్న చిన్నారులకు ఫుడ్‌పాయిజన్ అయిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన రమేశ్ స్థానికంగా ఉన్న కరీంనగర్ డెయిరీ పాలకేంద్రంలో దూద్ పేడా కొన్నాడు. ఇంటికి తీసుకెళ్లిన దూద్‌పేడాను తిన్న ఇద్దరు చిన్నారులకు ఫుడ్ పాయిజన్ అయి వాంతులు చేసుకున్నారు. దీంతో బాధితుడు రమేశ్ 4వ టౌన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.