అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : ఫోన్ కొంటానని నమ్మించి ఓ వ్యక్తి టోకరా వేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో డాక్టర్ పేరిట ఓ వ్యక్తి సెల్ ఫోన్ షాప్ కు ఫోన్ చేశాడు. జీజీహెచ్‌కు ఫోన్, పవర్ బ్యాంక్, ఇయర్ బర్డ్స్ తెస్తే తీసుకుంటానని నమ్మించాడు. దీంతో షాప్ యజమాని ఆస్పత్రికి రూ.90 వేల విలువైన ఫోన్, పవర్ బ్యాంక్, ఇయర్ బర్డ్స్ పంపించాడు. సదరు వ్యక్తి అతనిని సూపరింటెండెంట్ రూమ్ ఎదురుగా కూర్చోబెట్టి సార్‌కు ఇచ్చి డబ్బులు తెస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు బయట కూర్చోగా నిందితుడు వాటితో పరారయ్యాడు. దీనిపై బాధితుడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.