Advertisement
అక్షరటుడే,బోధన్: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలోని శక్కర్‌నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శక్కర్‌నగర్ కాలనీలో నివాసముండే విక్టరి దీపు(40) ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తూ ఇటీవలై సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మద్యానికి బానిసయ్యాడు. భార్య వారంక్రితమే పుట్టింటికి వెళ్లగా.. తల్లి ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి స్వర్ణలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement